భారత
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. వైభవ్ అరంగేట్ర మ్యాచ్‌లో 14 పరుగులు చేసినప్పటికీ, అతని ఆటతీరు అద్భుతంగా ఉందని, అది కేవలం 'ట్రైలర్' మాత్రమేనని, అసలు సినిమా ముందుందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో విశ్లేషించారు. ఒత్తిడిని అధిగమించి, భయమనేదే లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన వైభవ్, భవిష్యత్తులో భారత జట్టుకు లాంగ్ టర్మ్ ఓపెనర్‌గా ఎదిగే లక్షణాలున్నాయన్నారు.