AP: మద్యం మత్తులో ASI రాము హల్‌చల్ చేశారు. తిరుపతి జిల్లా సత్యనారాయణపురంలోని పూర్విక కర్రీ పాయింట్ వద్దకు ASI రాము వెళ్లారు. బిర్యానీ, చికెన్ కర్రీ పార్శిల్ చేయించుకున్నారు. డబ్బులు ఇవ్వకుండా పార్శిల్ తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో కర్రీ పాయింట్ నిర్వాహకుడు అడ్డుకున్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే తాను పోలీసునని, ఉచితంగా ఇవ్వాలని అనడంతో గొడవ మొదలైంది. దాంతో ఒకరిపై మరొకరు దాడికి దిగారు.