కాంగ్రెస్ అగ్రనేత పవన్ ఖేరా నివాసంలో అస్సాం పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ చర్యలు చోటు చేసుకున్నాయి. సోదాల అనంతరం పోలీసులు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పవన్ ఖేరా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనను కాంగ్రెస్ రాజకీయ వేధింపుగా ఖండించింది.