అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్ ఫిర్యాదుతో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు వెళ్లారు. ఖేరా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆస్తులను దాచిపెట్టారని రిణికి భూయాన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పరువునష్టం కేసు నమోదు చేయడంతో పోలీసులు ఖేరాను అరెస్ట్ చేసి విచారించేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే, ఖేరా ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అక్కడే వేచి చూస్తున్నారు.