AP: కోనసీమ కూటమి నేతలతో
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ పదవి కోసం ఐదుగురు నేతలు దరఖాస్తు చేసుకున్నారు. తమకు చైర్మన్ అవకాశం ఇవ్వాలని నేతలు మంత్రిని కోరారు. అయితే, చైర్మన్ ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక చైర్మన్ ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కొందరు మండలాధ్యక్షుల తీరుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.