అట్లాంటిక్, పసిఫిక్ రెండు మహాసముద్రాలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. వేడెక్కుతున్న అట్లాంటిక్ కారణంగా ఐరోపా, ఉత్తర అమెరికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పసిఫిక్‌లో ఎల్ నినో కారణంగా భారత ఉపఖండంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడి, జూన్ నెలలో 42% లోటు వర్షపాతం నమోదైంది. 166 ప్రధాన రిజర్వాయర్లలో కేవలం 25% నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికాలోని వందల కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి.