డే కేర్ సెంటర్‌లో దారుణం.. చిన్నారులను హింసించిన ఆయాలు!

27602చూసినవారు
బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీ క్యాంపస్ డే కేర్ సెంటర్‌లో ఆయాలు దారుణానికి తెగబడ్డారు. చిన్నారుల పట్ల రాక్షసంగా వ్యవహరించారు. పిల్లలు ఏడుస్తున్నారని వారిపై అమానుష చర్యలకు పాల్పడ్డారు. రెండు, మూడు ఏళ్ల వయసున్న పిల్లలను ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టడం, టాయిలెట్‌లోకి తీసుకెళ్లి బంధించడం వంటి చిత్రహింసలకు గురిచేశారు. ఓ పిల్లాడి నోట్లో టాయిలెట్ జెట్ స్ప్రేయర్‌తో నీళ్లు నింపినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు ఐదుగురు ఆయాలపై FIR నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్