AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి, హత్యాయత్నంపై వైసీసీ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ సీనియర్ నాయకుడు వైవి సుబ్బారెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. అంబటిపై టీడీపీ గూండాల దాడిని ఖండించిన ఆయన, ప్రతిపక్షాల నాయకుల ప్రాణాలకు రక్షణ లేదని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, అంబటి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేసి ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.