నాన్నను చంపాలని చూశారు:మౌనిక ఆవేదన

682చూసినవారు
నాన్నను చంపాలని చూశారు:మౌనిక ఆవేదన
AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఆదివారం తన తండ్రిపై జరిగిన హత్యాయత్నంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ఇంటిని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రిని రాడ్లతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారని, టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఈ దాడులను దగ్గరుండి చేయించారని ఆరోపించారు. ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా దాడులు చేశారని, తమపై కూడా హత్యాయత్నం జరిగిందని మౌనిక వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్