దంపతులపై దాడి.. భార్య స్పాట్ డెడ్ (వీడియో)

17811చూసినవారు
AP: పల్నాడు జిల్లా పెదకూరపాడులో దారుణం చోటుచేసుకుంది. ఆంజనేయస్వామి బొమ్మ సెంటర్ వద్ద ఒక ఇంట్లోకి దుండగులు ప్రవేశించి ఆధార్ కార్డు చూపించాలని దంపతులను అడిగారు. మీరు ఎవరు? మీకు ఎందుకు చూపించాలి ఆధార్ కార్డు? అని ప్రశ్నించిన దంపతులపై దుండగులు దాడి చేశారు. దాంతో దుండగులు భార్య గొంతు కోసి, భర్తను రాడ్డుతో తలపై కొట్టి పరారయ్యారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్