వైసీపీ కార్యాలయంపై దాడి.. సీసీటీవీ ఫుటేజ్ విడుదల

24499చూసినవారు
AP: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను వైసీపీ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియోలో కొందరు వైసీపీ కార్యాలయంలోకి ప్రవేశించి ఒక్కసారిగా దాడికి దిగినట్లు కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్