పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) రెబల్స్ దాడులు చేశారు. ఐదు జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో గన్నులతో దాడులు, అలాగే సూసైడ్ బాంబింగ్‌లను నిర్వహించారని సమాచారం. ఈ ఘటనల్లో 10 మంది సెక్యూరిటీ సిబ్బంది మృతి చెందగా, 37 BLA టెర్రరిస్ట్‌లు హతమయ్యారని అధికారులు తెలిపారు. BLA ‘ఆపరేషన్ హెరాఫ్’లలో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ దాడులలో మొత్తం 47 మంది మరణించారని నివేదికలు వెల్లడించాయి.