గల్ఫ్‌ దేశాలపై దాడులు.. ప్రవాస తెలుగువారి కోసం స్పీకర్‌ అయ్యన్న ఆరా

39చూసినవారు
గల్ఫ్‌ దేశాలపై దాడులు.. ప్రవాస తెలుగువారి కోసం స్పీకర్‌ అయ్యన్న ఆరా
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సుమారు యాభై వేల మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉపాధి కోసం నివసిస్తున్నారు. ఈ పరిస్థితిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరా తీశారు. నాతవరానికి చెందిన ప్రవాసితో మాట్లాడి తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :