TG: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌లో నిమ్స్ దవాఖాన ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. నిర్మాణ పనులు చేస్తున్న కుటుంబం నివాసం ఉంటున్న గదిలోకి వెళ్లి, బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి తలుపులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు కొట్టగా, నిందితుడు శంభు బండారి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.