గుండెపోటుతో ఏయూ విద్యార్థి మృతి

17250చూసినవారు
గుండెపోటుతో ఏయూ విద్యార్థి మృతి
AP: ఏయూలో బీఎడ్‌ చదువుతున్న విజయనగరానికి చెందిన వి.వెంకట సాయి మణికంఠ(23) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన ఘటన ఆందోళనకు దారి తీసింది. మణికంఠ  బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు తలుపు తీస్తుండగా కింద పడిపోయాడు. వెంటనే ఏయూ డిస్పెన్సరీకి చెందిన అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి కేజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సరికే గుండెపోటు కారణంగా ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్