తమిళనాడులోని తిరుప్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రసవం చేయించిన ఘటనలో 40 వారాల గర్భవతి శశికళ మృతి చెందింది. జూన్ 24న తెల్లవారుజామున నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అత్త పళనియత్తాల్‌తో యూట్యూబ్ సాయంతో ప్రసవం చేయించుకుంది. ఆడబిడ్డ జన్మించినా, అధిక రక్తస్రావంతో శశికళ పరిస్థితి విషమించింది. పలు ఆసుపత్రులకు తరలించినా ఫలితం లేక, ఆదివారం ఆమె మృతి చెందింది.