అల్లుడితో అత్త ఎఫైర్.. భర్తను చంపేసి ఏం తెలియనట్లు నాటకం

27997చూసినవారు
అల్లుడితో అత్త ఎఫైర్.. భర్తను చంపేసి ఏం తెలియనట్లు నాటకం
TG: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ భార్య అల్లుడితో ఎఫైర్ కారణంగా భర్తను చంపేసింది. ఆస్తి వివాదం, వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య అలివేలు, కూతురు పద్మ, అల్లుడు అంజనేయులు కలిసి యాదయ్య అనే వ్యక్తిపై ఇనుప రాడ్డుతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహంపై గాయాలను గమనించిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్