కరేబియన్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు తమ జోరును కొనసాగిస్తూ, వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కంగారూలు కైవసం చేసుకున్నారు. సెయింట్ కిట్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 269 పరుగులు చేయగా, వెస్టిండీస్ 179 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు జార్జియా వేర్హమ్, యాష్ గార్డనర్ తలా మూడు వికెట్లు తీయగా, జార్జియా వేర్హమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.