2023 వన్డే వరల్డ్ లో ఆఫ్ఘనిస్తాన్‍పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. 2026-27 సీజన్ కు గాను ప్రకటించిన 21 మంది ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో మ్యాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. టెస్ట్ ఫార్మాట్ కు ప్రాధాన్యత ఇస్తున్న బోర్డు, ఈ ఫార్మాట్ లో ఎక్కువ మ్యాచ్ లు ఆడేవారికి మాత్రమే కాంట్రాక్ట్ లు ఇస్తున్నట్లు తెలిపింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు ఉస్మాన్ ఖవాజాలకు కూడా చోటు లభించలేదు. ఈ పరిణామాలతో మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్నాయి.