ఆటో డ్రైవర్ నిజాయితీ.. 12 తులాల బంగారం పోలీసులకు అప్పగింత (వీడియో)

0చూసినవారు
విజయవాడలో ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ తన నిజాయితీని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ, లక్ష్మీబాయి దంపతులు మారుతి నగర్ నుంచి బస్టాండ్‌కు వెళ్లే క్రమంలో, 12 తులాల బంగారు నగలున్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ ఆ బ్యాగును గమనించి వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆయన నిజాయితీని అభినందిస్తూ అర్బన్ డీఎస్పీ శ్రీనివాసులు చంద్రశేఖర్‌ను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్