ఆటోమిత్ర పథకం.. దరఖాస్తు చేసుకోండిలా!

9287చూసినవారు
ఆటోమిత్ర పథకం.. దరఖాస్తు చేసుకోండిలా!
AP: ఆటోమిత్ర పథకానికి అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. తెల్లరేషన్ కార్డు ఉన్న వారి కుటుంబంలో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు ఉండరాదు. వెయ్యి చదరపు అడుగులు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. ఏపీ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ ధ్రువపత్రాలు సమర్పించాలి. విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్లలోపు ఉండాలి.