'అవరాపన్ 2' టీజర్ విడుదల

7449చూసినవారు
'అవరాపన్ 2' టీజర్ విడుదల
2007లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'అవరాపన్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'అవరాపన్ 2' టీజర్ విడుదలైంది. 19 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ మరోసారి శివమ్ పండిట్ పాత్రలో కనిపించనున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో దిశా పటాని, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. '19 ఏళ్ల తర్వాత శివమ్ తిరిగి వచ్చాడు. బాధలు, నష్టాలతో వెంటాడుతున్న ఓ వ్యక్తి తన జీవితానికి అర్థం వెతుక్కుంటున్నాడు' అనే క్యాప్షన్‌తో టీజర్ విడుదలైంది. ఈ చిత్రం 2026 ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే స్పెషల్గా విడుదల కానుంది. టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్