అవకాడో ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రాచుర్యం పొందింది. ఫిట్‌నెస్, బరువు నియంత్రణపై అవగాహన పెరగడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్న అవకాడో బరువు తగ్గే ప్రణాళికల్లోనూ ఉపయోగపడుతుంది. వైద్యుల ప్రకారం, దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, కీళ్ల నొప్పులు తగ్గుతాయి, కంటి ఆరోగ్యం కాపాడబడుతుంది.