గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పిండం ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పచ్చి బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని, అలాగే పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తిగా పండిన బొప్పాయిని, పూర్తిగా ఉడికించిన గుడ్లను వైద్యుల సలహా మేరకు తీసుకోవచ్చని తెలిపారు.