అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని స్కూలుకు అనుమతించని యాజమాన్యం

17చూసినవారు
అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని స్కూలుకు అనుమతించని యాజమాన్యం
ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో అయ్యప్ప మాల ధరించిన 5వ తరగతి విద్యార్థిని యాజమాన్యం అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. దీంతో అయ్యప్ప మాలధారులు, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. విషయం డీఈవో సుబ్బారావు దృష్టికి వెళ్లడంతో ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ ఘటనపై డీఈవో పాఠశాలకు నోటీసులు జారీ చేసి, రెండు రోజుల్లో సంజాయిషీ కోరారు. మాల ధరించిన విద్యార్థులను అనుమతించాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్