AP: తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేశారు. పుష్కరిణీలో స్నానం చేసేందుకు అయ్యప్ప భక్తులను టీటీడీ అనుమతించలేదు. టీటీడీ వైఖరికి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు, దీపారాధనలకు విజిలెన్స్ అధికారులు అనుమతించలేదు. భక్తుల తాకిడి తక్కువగా ఉండేలా ఆంక్షలు విధించారని అయ్యప్ప భక్తులు ఆరోపించారు.