AP: రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి అజయ్ నాయక్, బాలాజీ నాయక్ మధ్య జరిగిన స్వల్ప ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆగ్రహానికి గురైన అజయ్ నాయక్ కత్తితో బాలాజీ నాయక్ రూమ్ వద్దకు వెళ్లి బెదిరించినట్లు సమాచారం. వర్సిటీ అధికారులు వెంటనే స్పందించి గొడవను అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో, సీఐ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.