తమిళనాడుకు చెందిన బీటెక్ విద్యార్థిని ఎం.రీత (19) తిరుపతిలో ఆత్మహత్య చేసుకుంది. మానసిక ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్నట్లు ఆమె తల్లికి చెప్పింది. గత నెల 30న తిరుపతికి వచ్చి హోటల్‌లో గది తీసుకుంది. గది నుంచి బయటకు రాకపోవడంతో సిబ్బంది పరిశీలించి, ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు