భవనం పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థి సూసైడ్

9534చూసినవారు
భవనం పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థి సూసైడ్
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎ.రంగంపేట పంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి తర్వాత, ఒంగోలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జి.బాలాజీ (20) ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ విద్యాసంస్థలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న బాలాజీ, హాస్టల్‌లో ఉంటున్నాడు. మృతదేహాన్ని పోలీసులు వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్