క్రెడిట్ చోరీ చేయడంలో బాబు బిజీగా ఉన్నారు: బొత్స

1చూసినవారు
క్రెడిట్ చోరీ చేయడంలో బాబు బిజీగా ఉన్నారు: బొత్స
AP: సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించలేదని ఆరోపించారు. తమ హయాంలో చేసిన శంకుస్థాపనలనే మళ్లీ చేస్తున్నారని, రెండేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా అని ప్రశ్నించారు. రూ. లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :