AP: అనంతపురంలోని ఐసీడీఎస్ అనుబంధ శిశుగృహలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆకలితో ఓ పసికందు మృతి చెందింది. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ ఆగస్టు 30న జన్మించిన మగ శిశువును పోషించలేక శిశుగృహకు అప్పగించారు. దసరా పండగ రోజు రాత్రి విధుల్లో ఉండాల్సిన ఇద్దరు ఆయాల్లో ఒకరు మాత్రమే రావడంతో, అర్ధరాత్రి పసికందు ఆరోగ్యం బాగోలేదని సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనను కప్పిపుచ్చడానికి మృతదేహాన్ని పూడ్చిపెట్టగా, సిబ్బంది మధ్య గొడవలతో ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది.