ఈక్వెడార్‌కు చెందిన ఒక చిన్నారి తన తల్లి సమాధి వద్ద ఆటబొమ్మలతో ఆడుకుంటున్న హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి ఫోటోను చూస్తూ, ఆమె ఒడిలో ఉన్నట్లుగా ఆడుకుంటున్న ఆ చిన్నారి దృశ్యం నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియోను @streetchapri అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, 18 లక్షలకు పైగా మంది వీక్షించారు.