AP: విశాఖ ఎయిర్‌పోర్టులో అభిమానిపై హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అఖండ-2’ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణను విశాఖ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ అభిమానిపై ఆయన కోపం ప్రదర్శించారు. ‘ఇక్కడికి నిన్ను ఎవరు రమ్మన్నాడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం ఈవెంట్‌లో కూడా అతను కనిపించకూడదని సెక్యూరిటీకి ఆదేశాలిచ్చారు.