AP: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం జగన్‌ను 'సైకో' అనడంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణ ప్రపంచంలోనే అతి పెద్ద సైకో అని, కావాలంటే సర్టిఫికెట్ కూడా ప్రొడ్యూస్ చేస్తానని అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై అంబటి ఇచ్చిన ఈ కౌంటర్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.