AP: నందమూరి బాలకృష్ణ తుళ్లూరులో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆరోగ్య సంరక్షణతో పాటు ఏపీ రాజధాని అమరావతిని పరిపాలనా రాజధానిగా మార్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అధిపతిగా, క్యాన్సర్ చికిత్సను పేదలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని చెప్పారు. తుళ్లూరు క్యాన్సర్ ఆసుపత్రిలో సీఎస్సార్ మద్దతుతో ఏఐ ఆధారిత అల్ట్రాసౌండ్ పరికరాలు ప్రవేశపెడతామని వెల్లడించారు.