బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు: వైఎస్ జగన్

34100చూసినవారు
AP: మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీలో మాట్లాడారని జగన్ ఆరోపించారు. "తాగి ఉన్న వ్యక్తిని సభలోకి ఎలా అనుమతించారు?" అని ప్రశ్నించారు. బాలకృష్ణ పనీపాటలేని సంభాషణలు చేశారని, ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతోందని విమర్శించారు. కాగా, ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ, జగన్‌ను 'సైకో' అని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.