కరాచీ కింగ్స్ వర్సెస్ లాహోర్ ఖలందర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదం చోటుచేసుకుంది. లాహోర్ ఖలందర్స్ ఆటగాడు ఫఖర్ జమాన్ బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్లు అంపైర్లు గుర్తించారు. మ్యాచ్ రెఫరీ రోషన్ మహానామ, ఫఖర్ పీఎస్‌ఎల్ ప్లేయింగ్ కండిషన్స్‌లోని ఆర్టికల్ 41.3ను ఉల్లంఘించారని నిర్ధారించారు. బాల్ టాంపరింగ్ ఆరోపణలను మొదట తోసిపుచ్చిన ఫఖర్‌పై, విచారణ అనంతరం రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు.