లిఫ్ట్‌లో తీసుకెళ్తున్న బెలూన్స్ ఒక్కసారిగా పేలడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ షాకింగ్ ఘటన ముంబైలో జరిగింది. ఓ వ్యక్తి బెలూన్స్‌ను లిఫ్ట్‌లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఒక్కసారిగా పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.