చికెన్, మటన్ విక్రయాలపై నిషేధం

10చూసినవారు
చికెన్, మటన్ విక్రయాలపై నిషేధం
AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వారం రోజులపాటు మాంసం విక్రయాలపై అధికారులు నిషేధం విధించారు. చందాపురంలో డయేరియా వ్యాపిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, చికెన్ షాపులు, కర్రీ పాయింట్లలో మాంసం విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నందిగామలో కోడి, మేక, గొర్రె, చేపలు విక్రయాలు చేయరాదని మున్సిపల్ కమిషనర్ లోవరాజు ఆదేశించారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్