వింగో యాప్‌పై నిషేధం.. లక్షలాది మందిని మోసం చేసే కుట్ర భగ్నం

8688చూసినవారు
వింగో యాప్‌పై నిషేధం.. లక్షలాది మందిని మోసం చేసే కుట్ర భగ్నం
భారత ప్రభుత్వం వింగో అనే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ను నిషేధించింది. ఈ యాప్ లక్షలాది మంది వినియోగదారుల ఫోన్‌లను ఉపయోగించుకుని, వారికి తెలియకుండానే ఇతరులకు స్కామ్ మెసేజ్‌లు పంపుతోందని హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ భారీ మోసాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సైబర్ క్రైమ్ సెంటర్ (I4C) ఈ యాప్ సర్వర్‌లను బ్లాక్ చేసింది. ఆండ్రాయిడ్ వినియోగదారులను ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని, ఒకవేళ ఇప్పటికే ఉంటే వెంటనే తొలగించాలని I4C హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్