అరటి ధరకు రెక్కలు.. రైతులకు ఊరట

64చూసినవారు
అరటి ధరకు రెక్కలు.. రైతులకు ఊరట
AP: మార్కెట్లో అరటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. పులివెందుల మార్కెట్లో టన్ను అరటి గరిష్టంగా 16 నుంచి 17 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. నాణ్యత లేని అరటి టన్నుకి 10 వేల ధర పలుకుతోంది. ఈ ఏడాది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అరటి సాగు భారీగా పెరిగింది. మంచి వర్షాలు పడటంతో.. దిగుబడి కూడా బాగా వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ అరటికి డిమాండ్‌ తగ్గిపోయింది. నెల రోజుల క్రితం రాయలసీమలో అరటి ధర కిలో 8 నుంచి 10 రూపాయలు దాటలేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you