రివ్యూలు కొత్తవారికి మరణ శాసనాలు: డైరెక్టర్ సతీష్ జవ్వాజి

6694చూసినవారు
రివ్యూలు కొత్తవారికి మరణ శాసనాలు:  డైరెక్టర్ సతీష్ జవ్వాజి
మార్చిలో విడుదలైన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'బ్యాండ్ మేళం' బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. సినిమా బాగుందో లేదో చెప్పే హక్కు అందరికీ ఉన్నా, కించపరిచేలా విమర్శించడం సరికాదని దర్శకుడు సతీష్ జవ్వాజి అన్నారు. ఇది కొత్త దర్శకులకు మరణ శాసనాల్లా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రివ్యూలు రాసేవారు వందలాది కుటుంబాల కష్టాన్ని గుర్తించాలని, నిర్మాణాత్మక విమర్శను స్వీకరిస్తామని, కానీ వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. ప్రేక్షకులు రివ్యూలను నమ్మకుండా నేరుగా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్