సీఎం చంద్రబాబు కోసం తిరుమల వరకు బండ్ల గణేష్ మహా పాదయాత్ర

1చూసినవారు
సీఎం చంద్రబాబు కోసం తిరుమల వరకు బండ్ల గణేష్ మహా పాదయాత్ర
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి తన భక్తిని చాటుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం తిరుమల వెంకటేశ్వరస్వామికి చేసిన మొక్కును తీర్చుకునేందుకు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. జనవరి 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి కాలినడకన తిరుమల వరకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన త్వరగా విడుదలై మళ్లీ సీఎం కావాలని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో ఇప్పుడు మొక్కును తీర్చుకునే క్రమంలో ఈ యాత్ర చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్