AP: శ్రీకాకుళం జిల్లాలోని మూసవానిపేట సమీప తీరానికి బంగ్లాదేశ్‌కు చెందిన ఓ ఫిషింగ్ బోటు కొట్టుకొచ్చింది. సముద్రంలో దారి తప్పడంతో 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు తిప్పలు పడ్డారు. ఆహారం, ఇంధనం పూర్తిగా అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో బోటు ఒడ్డుకు చేరడంతో స్థానికులు, మెరైన్ పోలీసులు వెంటనే వారికి సహాయం అందించి సురక్షితంగా తీరానికి చేర్చారు. కాగా, దేశ సరిహద్దుల ఉల్లంఘనపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.