AP: రాష్ట్రంలో నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి సీఎం చంద్రబాబు సర్కార్ మినహాయింపు ఇచ్చింది. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్కు బదులుగా మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రంతో పాటు వేతన వివరాలు అందిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు.