ఫిబ్రవరి నెలలో బ్యాంక్ పనుల విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 28 రోజుల్లో దాదాపు 9 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆదివారాలు, శనివారాలతో పాటు ప్రాంతీయ పండుగలు కూడా తోడవడంతో బ్యాంక్ కస్టమర్లు తమ పనులను ముందే చక్కబెట్టుకోవడం మంచిది. ఫిబ్రవరి 18న సిక్కింలో, 19న మహారాష్ట్రలో, 20న మిజోరం, మణిపూర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. చెక్కుల క్లియరెన్స్, లోన్ అప్రూవల్స్ వంటి పనులను సెలవులకు ముందే పూర్తి చేసుకోవాలని సూచించారు.