
సీనియర్ నటుడు, రచయిత కృష్ణేశ్వరరావు కన్నుమూత
నాటక, సినీ రంగాలలో తనదైన ముద్రవేసిన సీనియర్ నటుడు, రచయిత యల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత ఏడాదిగా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని తన నివాసంలో కన్నుమూశారు. 'ప్రచండ భారతం' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణేశ్వరరావు ఎన్నో చిత్రాలకు రచన చేసి, నటించారు. నాటకరంగంలోనూ ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి, పలు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం జరుపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.




