
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
అద్దంకి మండల పరిధిలోని కోనంకిలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీకొనడంతో మేదరమెట్ల గ్రామానికి చెందిన మన్నె వెంకటేష్ అనే యువకుడు గాయాలపాలయ్యాడు. మార్టూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం మార్టూరు సీహెచ్‌సీకి తరలించారు.




































