CBI నుంచి ఫోన్ చేస్తున్నాం.. మనీ లాండరింగ్ కేసులో మీపై సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని చెప్పి సైబర్ నేరగాళ్లు అద్దంకి వాసి వద్ద డబ్బులు కాజేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెయిల్ మంజూరు కావాలంటే డబ్బులు చెల్లించాలని అద్దంకికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు నుంచి 3 వారాల క్రితం రూ.1.23 కోట్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.