శుక్రవారం కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామ శివారులోని పంట పొలాల్లో ఆస్ట్రేలియా నుండి వచ్చిన కొంగలు కనువిందు చేశాయి. బలమైన, ఎత్తైన ఈ కొంగలను కొందరు యువకులు సెల్ఫీలతో బంధించారు. ప్రతి సంవత్సరం జనవరి నెలాఖరులో ఈ పక్షులు ఖండాలు దాటి వస్తాయని, గుడ్లు పొదిగించి ఇక్కడి నుండి నేరుగా కృష్ణాజిల్లా వైపు వెళ్తాయని స్థానికులు తెలిపారు.